తిరుమల లడ్డూ పై చంద్రబాబు నీచ రాజకీయం : పోతిన మహేష్

-

వంద రోజుల్లో చేసింది చెప్పుకోలేక తిరుమల లడ్డూ ప్రసాదం పై చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని వైసీపీ నేత పోతిన మహేష్ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబుకు మంచి బుద్దిని ప్రసాదించాలని కోరుకుంటున్నానన్నారు. పరిపాలన గాలికొదిలేసి, ఇస్తామన్న పథకాలు ఇవ్వకుండా తన చేతకాని తనం బయటపడినప్పుడు వైఎస్ జగన్ పై చంద్రబాబు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.

100 రోజుల్లో అమలు చేస్తామన్న పథకాల గురించి ప్రజలు అడుగుతారని శ్రీవారి ప్రసాదం పై చంద్రబాబు విమర్శలు చేశారు. జులైలో రిపోర్టులో వస్తే.. సెప్టెంబర్ లో బయటపెట్టడం ఏంటి..? అని ప్రశ్నించారు. శాంపిల్స్ ఎప్పుడివి..? ఎక్కడ సేకరించారు. రిపోర్టు ఎప్పుడు ఇచ్చారు అని ప్రశ్నించారు. నాణ్యత లేకపోతే నెయ్యి ట్యాంకర్లను తిప్పి పంపించామని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. లడ్డూ ప్రసాదంలో నాణ్యత ప్రమాణాలు తగ్గకూడదని గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. 550 దేశీ ఆవులతో గోశాల ఏర్పాటు చేసింది కూడా వైసీపీ ప్రభుత్వమేనని.. ఇది చంద్రబాబుకు కనిపించడం లేదా..? అని పోతిన మహేష్ దుయ్యబట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version