నేడు కలెక్టర్లతో చంద్రబాబు అత్యవసర సమావేశం నిర్వహించనున్నారను. ఇవాళ ఉదయం 10 గంటలకు కలెక్టర్ల సదస్సు ఉంటుంది. ఈ సందర్భంగా వివిధ శాఖలపై సమీక్ష చేయనున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. సాయంత్రం ఎస్పీలతో శాంతి భద్రతలపై సమీక్ష ఉంటుంది. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ వరుసగా సీఎం సమీక్ష ఉండనుంది. కలెక్టర్ల సదస్సులో ప్రారంభోపన్యాసం చేయనున్నారు సీసీఎల్ఏ జయలక్ష్మి, సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్.
అనంతరం కలెక్టర్లను ఉద్దేశించి మాట్లాడనున్నారు సీఎం, డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి. ముందుగా వ్యవసాయ, అనుబంధ రంగాలు, అక్వా, అటవీ శాఖలపై సమీక్ష ఉంటుంది. తదుపరి గనులు, నీటి వనరులు, పరిశ్రమలు, రవాణా, విద్యుత్, పెట్టుబడులు మౌలిక సదుపాయాల కల్పనపై సమీక్ష ఉంటుంది. భోజన విరామం తర్వాత పాఠశాల, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ది, సంక్షేమ శాఖలు, పౌర సరఫరాల శాఖ, వైద్యారోగ్య, పురపాలక శాఖలపై సమీక్ష ఉండనుంది. చివరిగా రెవెన్యూ, ఎక్సైజ్ శాఖలు, శాంతి భద్రతలపై సమీక్ష చేయనున్నారు సీఎం చంద్రబాబు. కలెక్టర్ సదస్సుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు.