మందుబాబుల కష్టాలపై చంద్రబాబు హాట్ కామెంట్స్ చేశారు. ఇక్కడ నా తమ్ముళ్లు మందు బాబులు ఉంటారు.. రోజంతా కష్టపడతారు, ఒక పెగ్గు వేసుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, నాసిరకం సరుకు అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు. ఇక అటు పుంగనూరు-తంబళ్లపల్లె ఘటనల్లో టీడీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చంద్రబాబు సీరియస్ అయ్యారు.
పోలీసులు అర్థరహితంగా కేసులు పెడుతున్నారంటూ ఏలూరులో చంద్రబాబును కలిశారు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన పలువురు నేతలు. మారణాయుధాలతో వచ్చారని కేసులు పెట్టారంటూ చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారు నేతలు. అంగళ్లులో మారణాయుధాలతో దాడులకు యత్నించారని నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, అమర్నాధ్ రెడ్డి, ఘంటా నరహరి, శ్రీరాం చినబాబులపై కేసులు నమోదు చేశారు. కొంత మంది నేతలపై హత్యయత్నం కేసులు పెట్టారు పోలీసులు. పుంగనూరు ఘటనలో ఐదు ఎఫ్ఐఆర్లు నమోదు కాగా.. 200 మందిపై కేసుల నమోదు అయింది. ఈ విషయంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు.
ఇక్కడ నా తమ్ముళ్లు మందు బాబులు ఉంటారు.. రోజంతా కష్టపడతారు, ఒక పెగ్గు వేసుకోవాలి అనుకుంటారు. కానీ రేట్లు పెరిగిపోయాయి, నాసిరకం సరుకు అమ్ముతున్నారు – చంద్రబాబు నాయుడు pic.twitter.com/V582P2rd6i
— Telugu Scribe (@TeluguScribe) August 7, 2023