టీటీడీ పాలక మండలిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు !

-

టీటీడీ పాలక మండలిపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. టీటీడీ పాలకమండలి ప్రత్యేక ఆహ్వానితుల పిటిషన్ ను తాజాగా తిరస్కరించింది ఏపీ హైకోర్టు. పాలక మండలి చివరి మీటింగ్ కు అనుమతి ఇవ్వాలని వేసిన పిటిషన్లు తిరస్కరించింది హైకోర్టు. గతంలోనే పాలకమండలి 52 మంది ప్రత్యేక ఆహ్వానితుల నియామకంపై స్టే ఇచ్చింది. టీటీడీ పాలక మండలి ప్రత్యేక ఆహ్వానితులపై పిటిషన్ పై విచారణ జరిపింది హై కోర్టు.

ఇప్పటికే కరుణాకర రెడ్డి చైర్మన్ గా కొత్త బోర్డును ప్రభుత్వం నియమించినట్టు ఈ సందర్భంగా కోర్టుకు తెలిపారు పిటిషనర్. ఈ సమయంలో పాత బోర్డు లో ఉన్న వారికి మీటింగ్ కి అనుమతి ఇవ్వాల్సి అవసరం లేదని వెల్లడించారు. గతంలో చట్ట విరుద్ధంగా చేసిన నియామకాలకు సెక్షన్ 97 చట్ట సవరణ చేసి చట్ట బద్దత కలించినట్టు కోర్టుకు తెలిపిన పిటిషనర్… తాజాగా మరో 55 మందిని ప్రత్యేక ఆహ్వానితులను నియమించే అవకాశం ఉంది కాబట్టి వాటిని తాత్కాలికంగా ఆపాలని కోరారు. చట్ట సవరణ సవాలు చేయనున్నట్టు కోర్టుకు తెలిపారు పిటిషనర్. అయితే…ఈ నేపథ్యంలోనే చట్ట సవరణను సవాలు చేయటానికి అనుమతి ఇస్తూ శుక్రవారానికి కేసు వాయిదా వేసింది హై కోర్టు.

Read more RELATED
Recommended to you

Exit mobile version