తెలుగు దేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు రిమాండ్, పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. సీఐడీ కస్టడీ ముగిసిన తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి ఆన్ లైన్ ద్వారా ఏసీబీ జడ్జి ముందు చంద్రబాబును హాజరు పరచనున్నారు అధికారులు. ఏసీబీ కోర్టు నుంచే తర్వాతి ప్రక్రియ జరగనుంది. చంద్రబాబు జ్యుడీషియల్ రిమాండ్ పొడిగింపుపై నేటి సాయంత్రమే నిర్ణయం తీసుకోనున్నారు ఏసీబీ జడ్జి. దీంతో తెలుగు దేశం శ్రేణుల్లో తీవ్ర ఉత్కంఠత నెలకొంది.
ఇది ఇలా ఉండగా, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటీ ప్రొఫెషనల్స్… హైదరాబాద్ నుంచి ఏపీకి వస్తోన్నారు. ఈ సందర్భంగా రాజమండ్రి సెంట్రల్ జైలు వద్దకెళ్లి చంద్రబాబుకు సంఘీభావం తెలపనున్నారు ఐటీ ప్రొఫెషనల్స్. ఈ తరుణంలోనే… భారీగా ఐటీ ప్రోఫెషనల్స్ తరలి వస్తున్నట్టు ఏపీ పోలీసులకు సమాచారం అందింది. దీంతో తెలంగాణ బోర్డర్ వద్ద పోలీసులు మొహరించారు. హైదరాబాద్ వైపు నుంచి వస్తోన్న వాహానాలను తనిఖీ చేస్తోన్నారు పోలీసులు.