నేడు భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో వన్డే

-

భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య మూడు వన్డే సిరీస్ లో భాగంగా ఇవాళ రెండో వన్డే ఇండోర్ స్టేడియంలో జరుగనుంది. మొన్న జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. రెండో వన్డేలో ఇరు జట్లు కొన్ని మార్పులు చేర్పులు చేశారు. ఎలాగైనా రెండో వన్డేలో విజయం సాధించాలనే ధీమాతో ఆస్ట్రేలియా ఉంది. మరోవైపు రెండో వన్డే గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలనే పట్టుతో టీమిండియా ఉండటం విశేషం.

ఇండోర్ స్టేడియం బ్యాటింగ్ పిచ్ కావడంతో రెండు జట్లలోని బ్యాటర్లు మెరిస్తే స్టేడియంలో అభిమానులకు పరుగుల విందు లభించడం ఖాయంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి కీలక ఆటగాళ్లు లేకున్నా తొలి వన్డేలో భారత్ అదరగొట్టింది. ముఖ్యంగా భారత జట్టులో ఓ మార్పు చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రధానంగా బౌలర్ శార్దూల్ ఠాకూర్ మొన్న వన్డేలో 70కి పైగా పరుగులు సమర్పించుకున్నారు. దీంతో శార్దూల్ ఠాకూర్ స్థానంలో మొదటి వన్డేలో బెంచ్ కి పరిమితమైన మహ్మద్ సిరాజ్ ని తీసుకునే అవకాశం కనిపిస్తోంది.  ఆసీస్ జట్టు సిరీస్ నిలవాలంటే ఈ మ్యాచ్ కచ్చితంగా గెలవాలి. ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version