గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు అలర్ట్… వార్డు సచివాలయాల్లోని శానిటరీ, పర్యావరణ కార్యదర్శుల పనివేళల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 5 గంటల నుంచి 10 గంటల వరకు లేదా ఉదయం 6 నుంచి 11 గంటల వరకు క్షేత్రస్థాయిలో విధులు నిర్వహించాలని జాబ్ చార్ట్ సవరించారు. తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి సాయంత్రం వరకు అవసరాన్ని బట్టి సచివాలయాల్లో, క్షేత్రస్థాయిలో పనిచేయాలని తాజాగా ఉత్తర్వులు వెలువడ్డాయి.
ఇది ఇలా ఉండగా, టమాటా ధరలు రూ.100కు చేరడంతో ప్రజలపై భారం లేకుండా ప్రభుత్వం రంగంలోకి దిగింది. నేటి నుంచి అన్ని నగరాలు, పట్టణాల్లోని రైతు బజార్లలో కేజీ రూ. 50కి అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టింది. మదనపల్లె, పలమనేరు, పత్తికొండ, కలికిరి మార్కెట్లలో రైతుల నుంచి రూ. 70 చొప్పున రోజు 50-60 టన్నులు సేకరించనున్నారు. ధరలు అదుపులోకి వచ్చేవరకు సబ్సిడీ కొనసాగిస్తామని రైతు బజార్ల సీఈఓ నందకిషోర్ తెలిపారు.