రోజాకు చెక్.. వైసీపీలోకి టిడిపి ఎమ్మెల్యే తమ్ముడు?

-

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ప్రస్తుతం రసవత్తరంగా మారాయి. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. వైసీపీ కి కేవలం 11 సీట్లు మాత్రమే లభించాయి. దీంతో పలు సందర్భాల్లో చంద్రబాబు వైసీపీ గురించి ప్రస్తావించారు. అయితే ఇప్పటికే టీడీపీ నుంచి పలువురు నేతలు వైసీపీలో చేరుతున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ విజయం సాధిస్తుందని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.

ఈ నేపథ్యంలోనే మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడి చిన్న కుమారుడు, టీడీపీ నేత గాలి జగదీశ్ వైసీపీలో చేరనున్నట్టు సమాచారం. ఎల్లుండి మాజీ సీఎం జగన్ సమక్షంలో కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. నగరి టీడీపీ ఎమ్మెల్యే గా ఉన్న గాలి భాను ప్రకాశ్ సోదరుడే టీడీపీని వీడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరోవైపు మాజీ మంత్రి రోజాకు చెక్ పెట్టేందుకు జగదీశ్ ను పెద్దిరెడ్డి రామ చంద్రారెడ్డి తెరపైకి తీసుకొచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. మరో రెండు రోజుల్లోనే తేలనుంది. 

Read more RELATED
Recommended to you

Latest news