తిరుమలలో ఐదేళ్ల బాలుడుపై చిరుత దాడి చేసింది. మొదటి ఘాట్ రోడ్డులో బాలుడిని చిరుత ఎత్తుకెళ్లే ప్రయత్నం చేసింది. పోలీసులు కేకలు వేయడంతో వదిలేసి వెళ్లిపోయింది. గాయపడిన బాలుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఫారెస్ట్ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
ఇక తిరుమలలో పులి దాడిలో గాయపడిన బాలుడిని TTD EO ధర్మారెడ్డి పరామర్శించారు. బాలుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. నడక మార్గంలో బాలుడు తాతతో కలిసి వెళుతుండగా చిరుత దాడి చేసిందని ఈవో చెప్పారు. అయిదుగురు పోలీసులు అరుస్తూ ఫారెస్ట్ లోకి పరిగెత్తారని… భారీగా శబ్దాలు చేయడంతో చిరుత భయపడి బాలుడిని వదిలి వెళ్లిపోయిందని తెలిపారు. సిబ్బంది అప్రమత్తలతోనే బాలుడిని కాపాడగలిగామని వెల్లడించారు.