రెమ్యూనరేషన్ బట్టి పవన్ డైలాగులు, కాల్షీట్లు – మంత్రి చెల్లుబోయిన వేణు

-

 

జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై విరుచుకుపడ్డారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు. ఇవాల మీడియాతో మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడుతూ…రెమ్యూనరేషన్ బట్టి పవన్ డైలాగులు, కాల్షీట్లు ఉంటాయని విమర్శలు చేశారు. డబ్బులు సంపాదనకి రాజకీయాలు లోకి వచ్చారని ఫైర్‌ అయ్యారు.

హాలి డే టూర్ చేస్తున్నారు… పాం హౌస్ లో ఉంటే సచివాలయం వ్యవస్థ గురించి ఎలా తెలుస్తుందని నిలదీశారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు. అవగాహన లేకుండా అహంకారం తో పవన్ మాట్లాడుతున్నారని ఆగ్రహించారు. పవన్ కి నిలకడ లేదు, ఓపిక లేదంటూ మండిపడ్డారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు. ప్రజల్లోకి వచ్చి స్క్రిప్ట్ చదువుతున్నారని… చంద్రబాబు ను అధికారం లోకి తేవాలని పవన్ పని చేస్తున్నారని ఆగ్రహించారు. పిచ్చి మాటలతో ప్రజలు నమ్మకం కోల్పోయేలా చేయవద్దని హెచ్చరించారు. అబద్దానికి ఆసరాగా పవన్‌ కళ్యాణ్‌ నిలిచారన్నారు ఏపీ మంత్రి చెల్లుబోయిన వేణు.

Read more RELATED
Recommended to you

Exit mobile version