ఒక పక్క కరోనా కేసులతో భయపడుతున్న ప్రజలకు విశాఖ గ్యాస్ ప్రమాదం ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా చేసేలా ఉంది. ఎల్జీ పాలిమర్స్ అనే ఫార్మా కంపెనీ లో గ్యాస్ లీక్ కావడంతో దాదాపు 5 గ్రామాల ప్రజలు అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయారు. 5 గ్రామాల ప్రజలను అధికారులు ఖాళీ చేయిస్తున్నారు. ప్రవేట్ ఆస్పత్రులను అధికారులు అప్రమత్తం చేసారు. బాధితులను చేర్చుకోవాలని కోరారు.
ఫోటో; ఎన్టీవీ
ఇక ఇదిలా ఉంటే విశాఖలో ఇప్పుడు హృదయ విదారక దృశ్యాలు కనపడుతున్నాయి. నిలబడిన వాళ్ళు నిలబడినట్టే కుప్ప కూలిపోతున్నారు. పదుల సంఖ్యలో ప్రజలు ఊపిరి ఆడక అవస్థలు పడుతున్నారు. కొంత మంది కళ్ళు కనపడక బావిలో పడిపోయారు. ఇద్దరు ముగ్గురు ఇలాగే పడి ప్రాణాలు కోల్పోయారు. అక్కడ బయటకు వస్తున్న కొన్ని ఫోటోలు ఇప్పుడు కన్నీరు పెట్టిస్తున్నాయి.
ఇద్దరు బావిలో పడి మరణించారు. ఒక వ్యక్తి నురగ కక్కుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇక పక్షులు, బల్లులు, ఇతరత్రా జంతువులు కూడా ప్రాణాలు కోల్పోతున్నాయి. అక్కడ పరిస్థితి చాలా భయంకరంగా ఉందని అధికారులు చెప్తున్నారు. కొంత మందికి కడుపులో తీవ్రంగా ఉందని, కళ్ళు కనపడటం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.