నేడు వినుకొండలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభ

-

నేడు వినుకొండలో ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభ ఉండనుంది. ఈ మేరకు నేడు వినుకొండ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి జగన్ పర్యటించనున్నారు. మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వినుకొండ నియోజకవర్గంకు చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ..నేడు వినుకొండ శివయ్య స్తూపం వద్ద వైసిపి ఆద్వర్యం లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. ఈ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రసంగించనున్నారు.

Chief Minister Jagan visit to Vinukonda constituency today

కాగా, సీఎం జగన్‌ మేమంతా సిద్ధం కొనసాగనుంది. ఈ మేరకు సీఎం జగన్‌ మేమంతా సిద్ధం 11వ రోజు షెడ్యూల్..విడుదల అయింది. సీఎం జగన్ ఉదయం 9 గంటలకు వెంకటాచలంపల్లి రాత్రి బస చేసిన ప్రాంతం దగ్గర నుంచి బయలుదేరుతారు. ఉదయం 9:30 గంటలకి వెంకటాచలంపల్లి దగ్గర సామజిక పింఛన్ లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. బొదనంపాడు, కురిచేడు, చింతల చెరువు మీదుగా వినుకొండ అడ్డరోడ్ వద్దకు చేరుకుని భోజన విరామం తీసుకుంటారు. చీకటిగల పాలెం మీదుగా వినుకొండ 3 గంటలకు చేరుకుని రోడ్ షో కార్యక్రమంలో పాల్గొంటారు. కనమర్లపూడి, శావల్యాపురం మీదుగా గంటావారిపాలెం రాత్రి బసకు చేరుకుంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version