Chintakayala Ayyannapatra as Speaker of AP Assembly: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు ఎన్నికయ్యారు. ఏకగ్రీవంగా ఎన్నికైనట్టు ప్రకటించారు ప్రొటెం స్పీకర్ గోరంట్ల బుచ్చయ్య చౌదరి.
దీంతో ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా చింతకాయల అయ్యన్నపాత్రుడు బాధ్యతలు తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా, నర్సీపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్నపాత్రుడుకి నాలుగు దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో తెలుగుదేశం ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన అయ్యన్నపాత్రుడు….ఏడుసార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచారు.
ఇప్పటి వరకూ ఐదు ప్రభు త్వాల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు అయ్యన్న. మంత్రిగా సాంకేతిక విద్య, క్రీడా, రహదారులు భవనాలు, అటవీ, పంచాయతీ రాజ్ వంటి కీలక శాఖల బాధ్యతలు నిర్వర్తించారు అయ్యన్న. 1983 నుంచి ఇప్పటి వరకూ 10సార్లు అసెంబ్లీ ఎన్నికల్లో, 2 సార్లు పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన అయ్యన్న…ఇప్పుడు స్పీకర్ అయ్యారు.