సిరిసిల్లలో మరో నేత కార్మికుడు ఆత్మహత్య..యాసిడ్‌ తాగి మరీ !

-

రాజన్న సిరిసిల్ల జిల్లా మరో దారుణం జరిగింది. అప్పుల భాదతో మరో నేత కార్మికుడి ఆత్మహత్య జరిగింది. సిరిసిల్ల మున్సిపల్ పరిధి 11 వార్డు రాజీవ్ నగర్ కు కు చెందిన కుడిక్యాల నాగరాజు (47) అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పుల బాధతో బాత్రూంలో వాడే యాసిడ్ తాగి ఆత్మహత్య యత్నం చేశాడు. ఇక ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కుడిక్యాల నాగరాజు (47) అనే వ్యక్తి మరణించారు. మరమగాలు (పవర్లూమ్) నడుపుతూ జీవనం కొనసాగిస్తున్న నాగరాజు గత ఆరు నెలలనుండి ఉపాధి లేకపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడు.

Rajanna Sirisilla district is another atrocity

4 లక్షల అప్పు అయ్యిందని, ఫస్ట్ ఇయర్ చదువుతున్న అబ్బాయికి కాలేజి ఫీజు ఎలా కట్టాలని తీవ్ర ఆందోళనకు గురైయ్యారు నాగరాజు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆర్ద్ర రాత్రి మృతి చెందాడు. మృతుడు కుడిక్యాల నాగరాజుకు భార్య లావణ్య, కొడుకులు లోకేష్, విగ్నేష్ ఉన్నారు. మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ప్రభుత్వం నేత కార్మికుని కుటుంబ సభ్యులను ఆదుకోవాలని కోరారు. కాగా, కాంగ్రెస్‌సర్కార్‌ వచ్చిన తర్వాత సిరిసిల్లాలో నేతన్నల ఆత్మహత్యలు పెరుగుతున్నాయని బీఆర్‌ఎస్‌ మండిపడుతోంది.

Read more RELATED
Recommended to you

Latest news