చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో చింతమనేని సంచలన వ్యాఖ్యలు

-

గురువారం కృష్ణా జిల్లా గన్నవరంలో జరిగిన టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు వేడుకలలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్. గన్నవరం నియోజకవర్గంలో నుంచి టిడిపి తరఫున పోటీ చేయడానికి పది మంది వరకు పోటీ పడుతున్నారని అన్నారు. గన్నవరం టిడిపి ఇన్చార్జిగా సమర్థులైన వారిని చంద్రబాబు నియమిస్తారని.. ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదన్నారు చింతమనేని.

ఇప్పటికే 150 కోట్లు ఖర్చు చేస్తానంటూ తన వద్దకి ఒకరు వచ్చారని కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలోకి ఎంతో మంది వస్తుంటారు.. వెళుతుంటారని.. సరైన, దీటైన వారిని, మీరు మీసం మేనేసే వారిని త్వరలోనే తీసుకువస్తామని అన్నారు. రాష్ట్రంలోని మొత్తం 175 నియోజకవర్గాలలోని ప్రతి గ్రామంలో వైసీపీ సైకోలు తయారయ్యారని విమర్శించారు. చంద్రబాబు మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం బాగుపడుతుందని.. బాబుని గెలిపించుకోవలసిన బాధ్యత అందరిపై ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version