BREAKING: అనకాపల్లి రొయ్యల ఫ్యాక్టరీలో క్లోరిన్ లీక్….20 మంది మహిళలకు అస్వస్థత!

-

Chlorine leak in Anakapalli shrimp factory: అనకాపల్లి రొయ్యల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం జరిగింది. అనకాపల్లి జిల్లా యస్ రాయవరం మండలం ధర్మవరం కోస్టల్ గోల్డ్ రొయ్యల పరిశ్రమలో క్లోరిన్ లీక్ అయింది. క్లోరిన్ ట్యాంకు కిందపడి లీకవడంతో బ్లాకులో పని చేస్తున్న సుమారు ఇరవై మంది మహిళలకు అస్వస్థత నెలకొంది.

Chlorine leak in Anakapalli shrimp factory

అయితే…. బ్లాకు ఇంఛార్జ్ సత్వరమే స్పందిం చడంతో అనకాపల్లి రొయ్యల ఫ్యాక్టరీలో పెను ప్రమాదం తప్పింది. అటు హుటాహుటిన అడ్డురోడ్డులో ప్రయివేటు ఆసుపత్రికి 20 మంది మహిళలను తరలించారు. ఇక ప్రమాదం లేదని నిర్ధారణ కావడంతో మరల పని మొదలు పెట్టింది అనకాపల్లి రొయ్యల ఫ్యాక్టరీ యాజమాన్యం. ఇక ప్రమాదంపై ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version