Chanakya Niti : ఇలాంటి స్త్రీలను అస్సలు వివాహం చేసుకోకూడదట..!

-

Chanakya Niti : చాణక్యుడి సిద్ధాంతాలు మరియు సూత్రాలు జీవితానికి చాలా ఉపయోగపడతాయి.. మానవ మనస్తత్వం గురించి చాణుక్యుడికి లోతైన అవగాహన ఉంది. ఆచార్య చాణక్యుడు ప్రకారం.. కొన్ని రకాల స్త్రీలను వివాహం చేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి స్త్రీలు పురుషుల జీవితాలను నాశనం చేస్తారట. చాణక్య సూత్రాల ప్రకారం.. ఎలాంటి స్త్రీలను పెళ్లి చేసుకోకూడదో తెలుసుకుందాం.!

చాలా మంది మగవాళ్లు అందంగా ఉంటేనే ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చని అనుకుంటారు. అయితే అందం సరిపోదని, మంచి తెలివితేటలు, నైపుణ్యం కూడా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. అందం తాత్కాలికం. జీవితంలో తెలివితేటలు, నైపుణ్యాలు అవసరమని వివరించారు.

చాణక్యుడి ప్రకారం, అబద్ధం చెప్పే స్త్రీని ఎన్నటికీ వివాహం చేసుకోకండి. భర్త, కుటుంబ సభ్యులను మోసం చేసే అవకాశాలు ఎక్కువ. అబద్ధం చెబితే కుటుంబంలో కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య నమ్మకం లోపిస్తుంది.

చాణక్యుడు ప్రకారం, మీరు చెడు స్వభావం గల స్త్రీతో ఏడడుగులు వేస్తే, మీరు అడుగడుగునా కష్టాలను ఎదుర్కొంటారు. ఎప్పుడూ కోపంగా, అసూయగా ఉండే స్త్రీలు తమ భర్తల జీవితాలను నరకప్రాయంగా మార్చుకుంటారు.

చెడ్డ కుటుంబ నేపథ్యం ఉన్న స్త్రీని వివాహం చేసుకోకూడదు. అలాంటి వ్యక్తులు తమ కుటుంబ సభ్యుల నుండి చెడు లక్షణాలను అలవర్చుకోవచ్చు. దీని వల్ల పురుషులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది.

కుటుంబాన్ని చూసుకోలేని స్త్రీలను పెళ్లి చేసుకోవద్దని చాణుక్యుడు చెప్తున్నాడు. చాణుక్యుడి ప్రకారం.. స్త్రీ ఇంటిని, కుటుంబాన్ని చక్కదిద్దికోవాలి. భర్తకు అన్ని విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చే స్థాయిలో ఉండాలి. ఇంటి పనులు చేయలేని స్త్రీ భర్తకు భారంగానే ఉంటుందట.

చాణుక్యుడి చెప్పిన దాని ప్రకారం.. ఇలాంటి స్త్రీలను పెళ్లి చేసుకుంటే.. జీవితంలో సుఖం కంటే దుఖం మాత్రమే ఎక్కువ ఉంటుందట. చాణుక్యుడి అయినా భగవద్ధీగత అయినా మరి ఇంకేదానా చెప్పేది ఒక్కటే..”వ్యక్తిత్వం అనేది మనిషికి చాలా ముఖ్యమైనది.. అదే మీరు ఎలా ఉండాలో ఉండకూడదో నేర్పిస్తుంది. మానవత్వం ఉండాలి. సాయం చేసే గుణం ఉండాలి..అలా అని నీ పనులు మానుకోని, ఉన్నదంతా ఉడ్చేయమని ఎవ్వరూ చెప్పరు..! నువ్వు చేయగలవు, దానివల్ల నీకు ఎలాంటి నష్టం రాదు అన్నప్పుడు కూడా సైలెంట్‌గా ఉండిపోతున్నావంటే..నీ వ్యక్తిత్వం ఏ స్థాయిలో ఉందో అర్థంచేసుకో..!” ఇదే సారాంశం అన్ని గ్రంథాలు చెప్పేది..!

Read more RELATED
Recommended to you

Exit mobile version