టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో అరెస్ట్ అయి రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. రెండు రోజుల పాటు సీఐడీ విచారణ చేపట్టాలని ఏసీబీ కోర్టు తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. ఇవాళ చంద్రబాబును సీఐడీ అధికారుల బృందం విచారణ చేపట్టింది.
రాజమండ్రి సెంట్రల్ జైలులోని కాన్ఫరెన్స్ హాల్ లో చంద్రబాబుని సీఐడీ అధికారులు ప్రశ్నించారు. ఇవాళ తొలి రోజు చంద్రబాబు పై 50 ప్రశ్నలు విధించారు. చంద్రబాబు ఇచ్చిన సమాధానాలను వీడియో రికార్డింగ్ చేశారు. సెంట్రల్ జైలు వద్ద ఒక్కో టీమ్ లో ఒక డీఎస్పీ, ఇద్దరూ సీఐలున్నారు. అదేవిధంగా పోలీస్ బందో బస్తు కూడా బాగానే నిర్వహించారు. ఫస్టాప్ లో రెండున్నరగంటలు ప్రశ్నించారు. సెకండాప్ లో 4.30 గంటలు ప్రశ్నించారు. దాదాపు 7 గంటల పాటు విచారణ కొనసాగించారు. మొత్తం సీఐడీ అధికారులు 120 ప్రశ్నలతో రాజమండ్రి సెంట్రల్ జైలుకు వెళ్లారు. ఇవాళ చంద్రబాబుకి 50 ప్రశ్నలను సంధించారు. సీఐడీ డీఎస్పీ ధనుంజయ ఆధ్వర్యంలో ఈ ఇంటరాగేషన్ చేశారు.