మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇంట్లో ఏపీ CID సోదాలు

-

మాజీ మంత్రి నారాయణ కుమార్తె ఇళ్లలో ఏపీ సీఐడీ అధికారులు సోదాలు నిర్వహించారు. కూకట్‌పల్లి, కొండాపూర్‌, గచ్చిబౌలిలోని ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. అమరావతి భూముల కొనుగోలు అంశంలో సీఐడీ అదికారులు సోదాలు చేపట్టినట్లు తెలుస్తోంది.

గతంలో మాజీ మంత్రి నారాయణ ఇంట్లో కూడా అమరావతిలో అసైన్డ్​ భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించిన సీఐడీ సోదాలు నిర్వహించింది. గేటు వేసి మరీ ఎవరినీ లోపలికి రానీకుండా ఈ సోదాలు కొనసాగించడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. అమరావతిలో అసైన్డ్​ భూములు కొనుగోళ్లు, అమ్మకాలకు సంబంధించి మూడు సంవత్సరాల క్రితమే సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబుకు కూడా నోటీసులు ఇచ్చింది.

ఏపీలోని రాజధాని అసైన్డ్​ భూముల వ్యవహారంలో సీఐడీ గతంలో సీఐడీ ఐదుగురు వ్యక్తులను అరెస్టు చేసింది. అమరావతిలో 1100 ఎకరాల అసైన్డ్​ భూములలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. అదే ప్రాంతంలోని వేర్వేరు గ్రామాల్లో 89.9 ఎకరాల అసైన్డ్​ భూములను కొన్నారని తెలిపింది. వేర్వేరు సర్వే నంబర్లలోని అసైన్డ్​ భూములు మాజీ మంత్రి నారాయణ, ఆయన బంధువులు, తెలిసినవారి పేర్లతో కొనుగోలు చేశారని సీఐడీ పేర్కొంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version