గన్నరం మాజీ ఎమ్మెల్యే, వైఎస్‌ఆర్సీపీ నేత వల్లభనేని వంశీ మోహన్‌కు మరోసారి షాక్ తగిలింది. వంశీ రిమాండ్‌ను పొడిగిస్తూ సీఐడీ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గన్నవరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలపై దాడి కేసులో వల్లభనేని వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. ఈ కేసులో వల్లభనేని వంశీ సహా పది మంది నిందితుల రిమాండ్ పొడిగిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
గత ప్రభుత్వ హయాంలో గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా ఇతర నిందితులు నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం వీరంతా పోలీసుల రిమాండులో ఉన్నారు. అయితే ఇవాళ్టి (ఏప్రిల్ 9వ తేదీ)తో రిమాండ్ ముగియనున్న నేపథ్యంలో నిందితులను పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే తాజాగా సీఐడీ స్పెషల్ కోర్టు వంశీకి ఈ నెల 23వ తేదీ వరకు రిమాండ్ పొడిగించింది. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపుల కేసులో హైదరాబాద్‌లో వల్లభనేని వంశీని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడ తరలించారు. ఆ తర్వాత ఆయనపై పలు కేసులు నమోదైన విషయం తెలిసిందే.