వాట్సాప్​లో వెడ్డింగ్ కార్డ్ వైరల్.. పెళ్లి ఆపేసిన పోలీసులు

-

వాట్సాప్ లో వెడ్డింగ్ కార్డు వైరల్ కావడంతో అది కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ ఆహ్వాన పత్రికను చూసిన పోలీసులు ఆ వివాహాన్ని నిలిపివేశారు. అసలు పోలీసులు ఎందుకు అలా చేశారు..? ఆ వివాహ ఆహ్వాన పత్రికలో ఏం ఉంది..? అసలేం జరిగిందంటే..?

సత్యసాయి జిల్లా గోరంట్లలో ఓ వ్యక్తి ఇద్దరు బాలికల(అక్కా చెల్లెళ్లను)ను ఒకేసారి వివాహం చేసుకునేందుకు రెడీ అయ్యాడు. వాట్సాప్ లో ఈ పెళ్లికి సంబంధించిన వెడ్డింగ్ కార్డు వైరల్ కావడంతో ఐసీడీఎస్ అధికారులు రంగంలోకి దిగారు. దీనిపై ఆరా తీయగా.. బాలికల్లో ఒకరికి 16 ఏళ్లు, ఇంకొకరికి 15 సంవత్సరాల వయసు ఉన్నట్లు తెలిసింది.

ఇద్దరు మైనర్లకు పెళ్లి చేయడమే కాకుండా ఒకే వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించనున్నట్లు తెలుసుకున్న అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల తల్లిదండ్రులను, బంధువులను, కళ్యాణ మండపం నిర్వాహకుడిని ఠాణాకు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. చట్టాన్ని ధిక్కరించి పెళ్లి చేస్తే కఠిన చర్యలుంటాయని హెచ్చరించడంతో ఆ పెళ్లి ఆగిపోయింది.

Read more RELATED
Recommended to you

Latest news