అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు ఊహించని షాక్ తగిలింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో A14గా ఉన్న నారా లోకేష్ కు నోటీసులు ఇచ్చేందుకు సిఐడి అధికారులు ఢిల్లీ బయలుదేరారు. విచారణకు రావాల్సిందిగా నోటీసులు ఇవ్వనున్నారు. గత కొన్ని రోజులుగా ఆయన ఢిల్లీలోనే ఉన్న విషయం తెలిసిందే.
నారా లోకేష్‌కు 41A నోటీస్ ఇవ్వండని ఇప్పటికే చెప్పింది హై కోర్టు. అలాగే… విచారణకు సహకరించాలని నారా లోకేష్‌ను ఆదేశించింది కోర్టు. కాగా, అమరావతిలో 97KM మేర ఇన్నర్ రింగ్ రోడ్డు వేయాలని అప్పటి టిడిపి ప్రభుత్వం ప్లాన్ చేసింది. అయితే మొదట అనుకున్న ప్లాన్ ప్రకారం కాకుండా లింగమనేని రమేష్, హెరిటేజ్, మాజీ మంత్రి నారాయణకు చెందిన భూములకు ఆనుకొని రింగ్ రోడ్డు వెళ్లేలా అలైన్మెంట్ లో మార్పులు చేశారని వైసీపీ ఆరోపిస్తోంది. దీంతో వాళ్ళ భూముల ధరలు భారీగా పెరిగాయి అంటోంది. అసలు రింగురోడ్డే వేయలేదని… ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని టిడిపి ప్రశ్నించింది.