చంద్రబాబుకు షాక్ ఇచ్చిన సీజేఐ.. SLP పై ఏమన్నారంటే ?

-

టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ పై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిగిన విషయం తెలిసిందే. ఈ విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. మరోవైపు క్వాష్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు అక్టోబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్ మెంట్ వ్యవహారంలో తనపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని SLP దాఖలు చేశారు.

తొలుత చంద్రబాబు పిటిషన్ పై విచారణ చేపట్టేందుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎస్వీఎన్ భట్టి విముఖ వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు క్వాష్ పిటిషన్ ను సిద్దార్థ లూథ్రా సీజేఐ ముందు మళ్లీ పెన్షన్ చేశారు. తక్షణమే లిస్టింగ్ చేయాలని కోరారు. చంద్రబాబు బెయిల్ కోరుకుంటున్నారా అని సీజేఐ ప్రశ్నించారు. తాము బెయిల్ కోరుకోవడం లేదని.. చంద్రబాబు తరపు లాయర్ లూథ్రా తెలిపారు. త్వరగా లిస్ట్ చేయాలన్నది మా మొదటి అభ్యర్థన అని..  ఇవాళ లిస్ట్ అయినా కేసు తీసుకోలేదని లూథ్రా పేర్కొన్నారు. 17 ఏ ప్రకారం.. ఎఫ్ఐఆర్ చేయలేదని సీజేఐకి వివరించారు. ఎఫ్ఐఆర్ లో పేరు లేకుండా అరెస్ట్ చేయడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. దీంతో సీజేఐ మీకేం కావాలని లూథ్రాను ప్రశ్నించారు. సుప్రీంకోర్టులో చంద్రబాబు కేసు విచారణ మంగళవారానికి వాయిదా పడింది. మొత్తానికి సీజేఐ ముందు బాబు, సీఐడీ న్యాయవాదులు దాదాపు 20 నిమిషాలకు పైగా వాదనలు వినిపించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version