కోకాపేట భూవివాదంలో సంచలన విషయాలు వెలుగులోకి..!

-

గత కొద్ది రోజుల నుంచి కోకాపేట భూ వివాదం వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా  చంద్రశేఖర్ వేగె.. అలియాస్ చందు. గోల్డ్ షిప్ రియల్ ఎస్టేట్ సంస్థ  మేనేజింగ్ డైరెక్టర్..ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకటేశ్వర్ రెడ్డి కోకాపేటలో భూవివాదంతో తెరపైకి వచ్చిన పేరు ఇది. అప్పటి వరకు ఎవ్వరికీ తెలియని పేరు భూ వివాదంతో దేశ వ్యాప్తంగా గోల్డ్ షిప్ రియల్ ఎస్టేస్ సంస్థ పేరు మారు మ్రోగిపోతుంది. ఇటీవలే చంద్రశేఖర్ గురించి అన్నీ మోసాలు, దందాలే. వివాదాస్పద భూములు కొనుగోలు చేయడం.. వాటిని అడ్డం పెట్టుకుని అరాచకాలు చేయడమే వృత్తి అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహారం కొనసాగుతుందని వార్తలు వినిపించాయి. 

కోకాపేట భూవివాదంలో బైటపడ్డ అసలు వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ఎమ్మెల్సీ చల్ల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి లు   గోల్డ్ ఫిష్ ఎమ్ డీ చంద్ర శేఖర్ పూ కేసు పెట్టారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా దర్యాప్తులో బయటపడ్డ చంద్ర శేఖర్ అసలు రంగు. ఇలాంటి వివాదాలలాగానే అప్పటికే చంద్ర శేఖర్ పై 15 కేసులు ఉన్నాయని గుర్తించారు పోలీసులు. చంద్ర శేఖర్ పై నార్సింగిలో 3, గచ్చిబౌలిలో 2, రాయదుర్గంలో 2, కాచిగూడలో 1 కేసులు నమోదు అయ్యాయి. చంద్ర శేఖర్ బాధితుల్లో నటుడు ప్రభాస్ తమ్ముడు ప్రమోద్, నటుడు గోపీచంద్ మేనేజర్ శ్రీకాంత్, కొంతమంది సాఫ్ట్ వెర్ ఉద్యోగులు కూడా ఉన్నారని పోలీసులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version