తెలంగాణ ప్రభుత్వం ముస్లిం సోదరులకు గుడ్ న్యూస్ చెప్పింది. రంజాన్ పండుగ నేపథ్యంలో వారికి ప్రభుత్వం రెండు రోజుల పాటు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం.. మార్చ్ 31న ఈదుల్ ఫితర్, (రంజాన్) తోపాటు.. తరువాతి రోజైన ఏప్రిల్ 1న కూడా సెలవు దినంగా ప్రకటించింది. ఇక మార్చ్ 28న జమాతుల్-విదా, షబ్-ఎ-ఖాదర్ సందర్భంగా ఆప్షనల్ హాలిడే ఇచ్చింది.
ఆ రోజు మైనారిటీ విద్యాసంస్థలకు సెలవు ఉండనుండగా.. మిగతావి యధావిధిగా పనిచేస్తాయి. అయితే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటి నుంచి బోనాల పండగ మరుసటి రోజు, క్రిస్మస్ మరుసటి రోజు, రంజాన్ మరుసటి రోజు కూడా సెలవు ప్రకటించడం ఆనవాయితీగా వస్తుండగా.. ప్రస్తుత ప్రభుత్వం కూడా ఆ విధానాన్నే కొనసాగిస్తోంది. ఇక ఏపీ ప్రభుత్వం మాత్రం మార్చ్ 31న ఒక్కరోజు మాత్రమే సెలవుగా ప్రకటించింది.