విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్ : డిప్యూటీ సీఎం భట్టి

-

విద్యార్థుల భవిష్యత్తే.. రాష్ట్ర భవిష్యత్ అని తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. తాజాగా అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. విద్యార్థులకు కాస్మోటిక్ ఛార్జీలు పెంచామని తెలిపారు. అలాగే అద్దె భవనాలు కాకుండా సొంత భవనాలు కట్టించారా..? అని ప్రశ్నించారు. నేను చాలా ఆలోచించి రాజకీయాల్లోకి వచ్చాను. ఎలాంటి దుర్బుద్దితో రాజకీయాల్లోకి రాలేదు.

దేశం మొత్తం ఇవాళ తెలంగాణ వైపే చూస్తోంది. దోపిడి చేయడానికి మేము రాలేదు. శాఖలకు కేటాయించిన ప్రతీ రూపాయి ఖర్చు పెడతాం. రైతులకు 18వేల కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. అలాగే నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించేందుకు TGPSC ని ప్రక్షాళన చేసి.. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని వెల్లడించారు. రెసిడెన్సియల్ స్కూళ్ల పై సొంత భవనాలు ఎప్పుడైనా కట్టారా..? అని ప్రశ్నించారు. బాధ్యత లేని వ్యక్తులు ఏమైనా మాట్లాడారు. గాంజా రాజు.. లిక్కర్ రాణి అని బయట అక్కడ ఇక్కడ కామెంట్స్ చేస్తున్నారు. కానీ మా వాళ్లను నేను ఆపుతున్నానని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version