టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆయన ఫ్యాన్స్, ఐటి ఉద్యోగులు తలపెట్టిన ‘లెట్స్ మెట్రో ఫర్ సిబిఎన్’ కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈరోజు ఉదయం 10:30 గంటల నుంచి 11:30 మధ్యలో మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకు నల్ల టీషర్టులతో ప్రయాణించాలని ఫ్యాన్స్ భావించారు.

దీంతో మియాపూర్ మెట్రోను పోలీసులు మూసేశారు. మెట్రో స్టేషన్లలో బ్లాక్ టీషర్టులు ధరించిన వారిని వెనక్కి తిప్పి పంపిస్తున్నారు. మరోవైపు ఎల్బీనగర్ మెట్రోస్టేషన్ వద్ద నల్ల టీషర్ట్ వేసుకొని వచ్చిన యువకులను అడ్డుకోవడంతో.. పక్కనే ఉన్న డీ – మార్టులోకి వెళ్లి ఇతర రంగు టీషర్ట్‌లు కొనుగోలు చేసి వెళ్తున్నారు. శనివారం ఉదయం 10.30 – 11.30 గంటల మధ్య మియాపూర్ నుంచి ఎల్బీనగర్ వరకూ నల్ల టీషర్టులు ధరించి మెట్రోలో ప్రయాణించాలని చంద్రబాబు అభిమానులు పిలుపునిచ్చారు. మెట్రో ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ శాంతియుత నిరసన చేపట్టాలని నిర్ణయించారు.