ఏపీ సీఎం చంద్రబాబును టార్గెట్ చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కే.ఏ.పాల్. చంద్రబాబుకు ఇదే నా డెడ్ లైన్ అంటూ వార్నింగ్ ఇచ్చాడు కే.ఏ.పాల్. వారం రోజుల్లోగా నన్ను కలవకపోతే…అక్టోబర్ 2 వ తేదీలోగా అమెరికా రాకపోతే… నేను తీసుకునే చర్యలు ఎలా ఉంటాయో దేవుడే నిర్ణయిస్తాడని వార్నింగ్ ఇచ్చారు.
వైజాగ్ ఎంపీ ,గాజువాక ఎమ్మెల్యే ఎన్నికను రద్దు చేయాలని కోరుతున్నానని పేర్కొన్నారు. స్టీల్ ప్లాంట్ అమ్మకాన్ని అడ్డుకున్నది నేనే అంటూ కామెంట్స్ చేశారు కే.ఏ.పాల్. కూటమి హఠావో…ప్రజాశాంతి గెలవాలని… చంద్రబాబు ఖజానా ఖాళీ అని చేతులెత్తేశాడని ఆగ్రహించారు. ఏపీలో జరిగిన ఎన్నికలు అవినీతిమయమన్నారు.
ఈవీఎంలు టాంపర్ అయ్యాయని ఆరోపణలు చేశారు. 1800 బూత్ లలో మా ఓట్లు ఎలా మిస్సయ్యాయో ఆధారాలతో చెప్పానని… మా ఫ్యామిలీ నుంచి 25 ఓట్లు వేస్తే…రెండే చూపించారని ఫైర్ అయ్యారు. ఇప్పుడు మళ్లీ ఈవీఎంల ద్వారా ఎన్నికలు జరిగితే దేశంలో ప్రజాస్వామ్యం పూర్తిగా ఖూనీ అయినట్లేనని తెలిపారు.