10 జిల్లాలకు డీసీసీబీ ఛైర్మన్లను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. శ్రీకాకుళం డీసీసీబీ ఛైర్మన్‍గా శివ్వల సూర్యనారాయణ(టీడీపీ), విశాఖ డీసీసీబీ ఛైర్మన్‍గా కోన తాతారావు (జనసేన) పేర్లను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. విజయనగరం డీసీసీబీ ఛైర్మన్‍గా కిమిడి నాగార్జున(టీడీపీ), గుంటూరు డీసీసీబీ ఛైర్మన్‍గా మాకినేని మల్లికార్జునరావు(టీడీపీ), కృష్ణా డీసీసీబీ ఛైర్మన్‍గా నెట్టెం రఘురామ్(టీడీపీ) నియామకం అయ్యారు.

నెల్లూరు డీసీసీబీ ఛైర్మన్‍గా ధనుంజయరెడ్డి(టీడీపీ), చిత్తూరు డీసీసీబీ ఛైర్మన్‍గా అమాస రాజశేఖర్ రెడ్డి(టీడీపీ) పేర్లను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు. అనంతపురం డీసీసీబీ ఛైర్మన్‍గా కేశవరెడ్డి(టీడీపీ), కర్నూలు డీసీసీబీ ఛైర్మన్‍గా డి.విష్ణువర్ధన్ రెడ్డి(టీడీపీ) కడప డీసీసీబీ ఛైర్మన్‍గా బి.సూర్యనారాయణరెడ్డి(టీడీపీ) పేర్లను ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు.