Legendary director Karun passes away: సినిమా ఇండస్ట్రీలో మరో విషాదం నెలకొంది. తాజాగా లెజెండరీ డైరెక్టర్ కరుణ్ మృతి చెందారు. మలయాళ లిజెండరీ దర్శకుడు షాజీ కరుణ్ మరణించారు. 73 సంవత్సరాల లెజెండరీ డైరెక్టర్ కరుణ్ తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల ఆసుపత్రి పాలయ్యారు. ఈ నేపథ్యంలోనే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మరణించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని స్వయంగా ఆయన కుటుంబ సభ్యులు అధికారికంగా ప్రకటించారు.

కాగా 1974 సంవత్సరంలో సినిమా ఆటోగ్రాఫర్ గా కరుణ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టడం జరిగింది. 1988లో డైరెక్టర్ గా తీసిన పిరవి జాతీయ ఉత్తమ చిత్రo సహా అనేక అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది. స్వహాం, వన ప్రస్తo లాంటి సినిమాలు కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శించబడ్డాయి. అటు… దర్శకుడు కరుణ్ కేరళ రాష్ట్ర, పద్మశ్రీ అలాగే అంతర్జాతీయ అవార్డులను దక్కించుకున్నారు.