Pakistan PM Shehbaz Sharif hospitalised: ఇండియా వర్సెస్ పాకిస్తాన్ యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో… ఆ దేశానికి ఊహించని షాక్ తగిలింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కు ఊహించని పరిణామం ఎదురయింది. తాజాగా పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ ఆస్పత్రి పాలయ్యారు. బీపీ ఎక్కువ కావడంతో ఆయనను ఆసుపత్రికి తరలించారని చెబుతున్నారు.

ప్రస్తుతం ఆయన పరిస్థితి మెరుగ్గానే ఉందని అంటున్నారు. దీనికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో ఎంత మేరకు వాస్తవం ఉందో తెలియాల్సి ఉంది. ఇది ఇలా ఉండగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో ఉగ్రవాదులు… మారణకాండ చేసిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 మంది పర్యాటకులను.. అన్యాయంగా చంపేశారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. దీంతో పాకిస్తాన్ వర్సెస్ ఇండియా మధ్య యుద్ధం వాతావరణం నెలకొంది.