ఏపీ పేదలకు శుభవార్త చెప్పారు సీఎం చంద్రబాబు నాయుడు. ఏపీ పేదలకు 3 సెంట్ల ఇళ్ల స్థలాలు, రూ.75 వేలు ఇస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు నాయుడు.అర్హులైన నిరు పేదలకు త్వరలోనే ఇళ్ల స్థలాలు ఇస్తామని తెలిపారు. తాజాగా కలెక్టర్ల సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.
2029 నాటికి అర్హులందరికీ ఇండ్లు ఇస్తామని కూడా వెల్లడించారు. స్థలాలు లేని నిరుపేదలకు పట్టణాలలో రెండు సెంట్లు, అదే గ్రామస్థాయిలో అయితే మూడు సెంట్లు ఇళ్ల స్థలాలు మంజూరు చేస్తామని ప్రకటన చేశారు. ఇండ్ల నిర్మాణానికి ఎస్సీలు అలాగే చేనేతలకు అదనంగా 50వేల రూపాయలు, అలాగే ఎస్టీలకు అయితే 75 వేల రూపాయలు అందిస్తామని ప్రకటన చేశారు చంద్రబాబు నాయుడు.
వైసిపి వదిలేసిన నిర్మాణాలను కూడా పూర్తి చేస్తామని… భరోసా కల్పించారు నారా చంద్రబాబు నాయుడు. అటు లా అండ్ ఆర్డర్ రివ్యూలో సీఎం చంద్రబాబు కీలక సూచనలు చేసారు. సైబర్ క్రైంలు, ఛీటింగ్ లు జరగకుండా కంట్రోల్ చేయాలి. రెండు టీంలు ఏర్పాటు చేయాలి అని సూచించారు.