అప్పన్నస్వామి చందనోత్సవంలో 7 గురు మృతి నేపథ్యంలో.. రంగంలోకి సీఎం చంద్రబాబు దిగారు. శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవంలో గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందడం నన్ను కలచి వేసిందన్నారు సీఎం చంద్రబాబు. భారీ వర్షాల కారణంగా గోడ కూలడం తో జరిగిన ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.

అక్కడి పరిస్థితి పై జిల్లా కలెక్టర్, ఎస్పీ తో మాట్లాడాను. గాయపడిన వారికి చికిత్స అందించాలని ఆదేశించాను. ఎప్పటికప్పుడు పరిస్థితి ని సమీక్షిస్తున్నానన్నారు సీఎం చంద్రబాబు. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 గురు భక్తులు మృతి చెందారు. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 గురు మృతి చెందారు.