వరాహ లక్ష్మీనరసింహ స్వామివారు నిజరూపంలో దర్శనమిస్తున్నారు. ఈ తరుణంలోనే స్వామివారిని దర్శించుకునేందుకు సింహగిరికి భారీ ఎత్తున పోటెత్తారు భక్తులు. నిజరూపంలోకి వచ్చిన స్వామివారికి విశేష అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేస్తున్నారు. జోరు వర్షంలోనే స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు భక్తులు. సింహాచలం అప్పన్న స్వామి నిజరూప తొలి దర్శనం అనువంశిక ధర్మకర్త ఆలయ ఛైర్మన్ పూసపాటి అశోక్ గజపతిరాజు, కుటుంబ సభ్యులు చేసుకున్నారు.

కాగా, విశాఖలోని సింహాద్రి అప్పన్నస్వామి చందనోత్సవంలో తీవ్ర విషాదం నెలకొంది. సింహాద్రి అప్పన్న స్వామి చందనోత్సవంలో గోడ కూలి 7 గురు భక్తులు మృతి చెందారు. సింహాద్రి అప్పన్న స్వామివారి నిజరూపాన్ని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులపై గోడ కూలడంతో 7 గురు మృతి చెందారు.