విద్యార్థులకు అలర్ట్‌…శుక్రవారం నుంచే సంక్రాంతి సెలవులు

-

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. ఈ శుక్రవారం నుంచి.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రారంభం కాబోతున్నాయి. ఈ మేరకు స్కూల్ విద్యార్థులకు శుభవార్త చెప్పింది చంద్రబాబు నాయుడు సర్కార్. అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం ముందుగా ప్రకటించినట్లుగానే ఈ నెల 10వ తేదీ అంటే శుక్రవారం నుంచి.. సంక్రాంతి సెలవులు ప్రారంభం అవుతాయని… స్కూల్ యాజమాన్యాలకు తెలిపింది కూటమి సర్కార్.

Sankranti holidays for schools from Friday

సంక్రాంతి సెలవులు 19వ తేదీన ముగిస్తాయని వివరించింది. ఇక ఈనెల 20వ తేదీ నుంచి… ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు పునః ప్రారంభం అవుతాయని పేర్కొనడం జరిగింది. అలాగే క్రిస్టియన్స్ స్కూల్లకు మాత్రం ఈనెల 11వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మాత్రం సంక్రాంతి సెలవులు ఉంటాయని వివరించింది. ఇది ఇలా ఉండగా సంక్రాంతి సెలవులు కుధిస్తారని మొదట ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కానీ చంద్రబాబు నాయుడు సర్కార్ అలాంటి పని ఏమీ చేయలేదు. గతంలో ఇచ్చినట్లుగానే సెలవులు ఇవ్వడం జరిగింది. దాదాపు పది రోజులపాటు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news