దేవాదాయ శాఖ శాఖపై చంద్రబాబు కీలక నిర్ణయాలు.. జీతాల పెంపకం..!

-

దేవాదాయ శాఖపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రిలీజియస్ టూరిజం ప్రమోషన్ కోసం ఎండో, ఫారెస్ట్, టూరిజం మంత్రులతో కమిటీ వేస్తున్నాం. ఇక పై దేవాలయాల్లో ఆధ్యాత్మిక వెల్లివిరవాలి. దేవాలయాల్లో అపచారాలకు చోటు ఉండకూడదు. బలవంతపు మత మార్పిడులు, అన్య మతస్థులు రాకూడదు. భక్తుల మనోభావాలకు, ఆగమశాస్త్ర నిబంధనలకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి అని పేర్కొన్నారు.

అలాగే దేవాలయాల ట్రస్ట్ బోర్డులో అదనంగా మరో ఇద్దరికి అవకాశం ఇస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా 10 వేలు జీతం వచ్చే అర్చకులకు ఇక పై 15 వేలు.. ధూపదీప నైవేద్యాలకు ఇచ్చే మొత్తం 5 వేల నుంచి10 వేలకు పెంచారు. నిరుద్యోగ వేద విద్యార్ధులకు నెలకు రూ. 3 వేలు భృతి.. నాయీ బ్రాహ్మణులకు కనీస వేతనం 25 వేలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇక సీజీఎఫ్ కింద, శ్రీవాణి ట్రస్ట్ నిధుల ద్వారా జరిగే పనుల్లో ప్రారంభం కానీ పనులు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నారు. దేవాలయ ఆస్తుల పరిరక్షణకు కమిటీలను ఏర్పాటు చేయనున్నారు. పరిశుభ్రత, ప్రసాదంలో నాణ్యత, ప్రశాంత వాతావరణం కనిపించేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version