ఆ పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి : చంద్రబాబు

-

రాష్ట్రంలో మాదక ద్రవ్యాల వినియోగం, గంజాయి వాడకంతో, తల్లికి ,చెల్లికి కూతురికి, తేడా లేకుండా కొంతమంది దుర్మార్గులు ప్రవర్తిస్తున్నారు. అలాంటివి ఇక మీదట జరగకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్రంలో చెత్త పన్ను విధించి రాష్ట్రాన్ని చెత్త రాష్ట్రంగా మార్చారు. ఆ చెత్తలో వేసి వీళ్ళని కప్పి పెట్టాలి. చెత్త పన్ను రాష్ట్రంలో తీసి వేసాం. రాష్ట్రంలో రోడ్లన్నీ గుంతలు పెట్టారు. 600 కోట్లతో గుంతలు పూడుస్తున్నాం. నవంబర్ 1 నుంచి రోడ్ల గుంతలు పూడుస్తాం. నూతన సంవత్సరానికి రాష్ట్రంలో గుంతలు లేకుండా చేస్తాం.

రాష్ట్రంలో అరాచకాలకు వైసీపీ పాల్పడుతుంది. రథాలు తగలబెట్టడం ,ఆడవాళ్ళపై అఘాయిత్యానికి పాల్పడటం చేస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న 14వేల సీసీ కెమెరాలు గత ప్రభుత్వం వాడలేదు. ప్రభుత్వ ఆస్తిని కూడా వాడుకోలేని దుస్థితి లో ఉన్నారు. రాష్ట్రంలో వీధిలైట్లు అన్ని వెలగాలి. అధికారులు కూడా అశ్రద్ధ వీడాలి. గత ప్రభుత్వం చేసిన పాపాలు ప్రజలను వెంటాడుతున్నాయి. తవ్విన కొద్దీ అవినీతి, అరాచకాలు బయటపడుతున్నాయి. అడవి పందులు, పంటను నాశనం చేసినట్లు, రాష్ట్రాన్ని పీల్చి పిప్పి చేశారు అని చంద్రబాబు పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version