చిత్తూరు జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు సమావేశం అయ్యారు. సమావేశంలో అధికారులకి స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజలకు నిజంగా సేవ చేయాలనుకునే వారు మాత్రమే విధుల్లో ఉండాలని పేర్కొన్నారు. గడిచిన ఐదేళ్లలో అధికారులు చేసిన దాష్టికాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం చంద్రబాబు.. జిల్లా ప్రజలు కానీ, కుప్పం ప్రజలు గాని సమస్య అని వస్తే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు.
రెస్కో, ట్రాన్స్ పోట్, అటవీ, ఐసీడీఎస్, పోలీస్, రెవిన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. గడచిన ఐదేళ్లలో ఇష్టానుసారంగా వ్యవహరించిన తీరు ఇక నడవదన్నారు. ప్రజా సమస్య అజండగా పనిచేస్తేనే ఉద్యోగం నిలుస్తుందని చంద్రబాబు తేల్చిచెప్పారు. కుప్పంలో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా స్థానిక ఆర్అండ్‌బీ అతిథి గృహం వద్ద ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున వచ్చిన ప్రజల నుండి చంద్రబాబు స్వయంగా వినతులు స్వీకరించారు. సమస్యల పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారు.