ప్రధాని మోడీతో రేపు సీఎం చంద్రబాబు భేటీ..!

-

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు మంగళవారం ఢిల్లీ  వెళ్లనున్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లను టీడీపీ ఎంపీలు పూర్తి చేసినట్లు సమాచారం. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీతో సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సీఎం అమరావతి పనుల పునః ప్రారంభానికి ప్రధాని మోడీని ఆహ్వానించనున్నట్లు సమాచారం. అలాగే రాష్ట్రానికి రావాల్సిన నిధులతో పాటు ఇతర అంశాలపై పీఎం మోడీతో చర్చించనున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలో పలువురు కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే.. రాజధాని
అమరావతి  నిర్మాణాలకు ప్రపంచ బ్యాంకు సహా అనేక ఆర్థిక సంస్థల నుంచి నిధులను సమీకరించడం, రెండు ప్రతిష్ఠాత్మకమైన బ్యాంకులతో పాటు హడ్కో కూడా రుణాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీంతో అమరావతిలో అనేక నిర్మాణాలు చేపట్టేందుకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియను CRDA పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో అమరావతిలో మళ్లీ నిర్మాణ పనులు ప్రారంభించడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమైంది.

Read more RELATED
Recommended to you

Latest news