మదనపల్లె అగ్నిప్రమాదంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం..వైసీపీ కుట్రలేనని !

-

మదన పల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాద ఘటనపై సిఎం చంద్రబాబు ఉన్నత స్ధాయి సమీక్ష నిర్వహించారు. సీఎస్, సిఎంఓ, ఇంటెలిజెన్స్ చీఫ్, పోలీసు అధికారులతో సమీక్ష నిర్వహించారు. అసైన్డ్ భూముల ఫైల్స్ దగ్ధం అయినట్లు ప్రాథమిక సమాచారం అందుతోంది. దీనిపై చంద్రబాబు సీరియస్‌ అయ్యారు. ఘటనపై జిల్లా అధికారుల సత్వర స్పందన లేకపోవడంపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

CM Chandrababu’s anger over Madanapalle fire

ఆదివారం రాత్రి 10.30 గంటలకు వరకు కార్యాలయంలోనే గౌతమ్ అనే ఉద్యోగి ఉన్నారని గుర్తించారని సమాచారం. ఆదివారం ఒక ప్రభుత్వ ఉద్యోగి ఆ సమయం వరకు ఉండడానికి కారణాలు తెలుసుకోవాలన్న సీఎం….గౌతమ్ ఎందుకు వెళ్లాడు, ఏ పని కోసం వెళ్లాడని తెలిపారు. ఈ ఘటనా ప్రాంతానికి పోలీసు జాగిలాలు వెళ్లాయా, ఉదయం నుంచి ఏం విచారణ చేశారని సీఎం ప్రశ్నలు సంధించారట. ఫోరెన్సిక్ ఆధారాల సేకరణ, ఇతర ఆధారాల సేకరణ విషయంలో జాప్యం పై ప్రశ్నించిన ముఖ్యమంత్రి చంద్రబాబు…ఘటన సమయంలో విద్యుత్ సరఫరా పరిస్థితిపైనా విచారణ జరపాలని ఆదేశాలు ఇష్యూ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news