బడ్జెట్‌లో ‘ఈజ్ ఆఫ్ డూయిండ్ బిజినెస్’పై చాలా నిర్ణయాలు తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పార్లమెంట్లో ఈరోజు నిర్మలా సీతారామన్ 2023-24కు సంబంధించిన ‘ఆర్థిక సర్వే’ను ప్రవేశపెట్టారు. కేంద్ర ముఖ్య ఆర్థిక సలహాదారు వి అనంత నాగేశ్వరన్ ఆధ్వర్యంలో ఈ ఆర్థిక సర్వేను రూపొందించారు. ఇక మంగళవారం జరగబోయే పార్లమెంట్ సమావేశంలో పూర్తి స్థాయి బడ్జెట్ 2024-25 ప్రవేశపెడతారు.
2024-25 ఆర్థిక సంవత్సారానికిగాను దేశ వాస్తవ జీడీపీ 6.5-7 శాతం వరకు వృద్ధి చెందుతుందని ఈ సర్వేలో అంచనా వేశారు. బడ్జెట్ 2024-25లో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌పై చాలా నిర్ణయాలు తీసుకున్నామని.. దాదాపు 11 దశల్లో దీనిపై చర్చలు జరిగాయని మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ముఖ్యంగా 63 నేరాలను డీక్రిమినలైజేషన్ చేయడం వల్ల ప్రస్తుతం కంపెనీలు సమర్థంగా కొనసాగుతున్నాయని చెప్పారు. 2023-24లో 8.2 వృద్ధి సాధించినట్లు ఆర్థిక సర్వేలో వెల్లడించారు. ఇక ఆర్థిక సర్వే విడుదలకు ముందు మాట్లాడుతూ, ‘భారత రాజకీయాల్లో 60 ఏళ్ల తర్వాత మూడోసారి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం బడ్జెట్‌ను ప్రవేశపెడుతుండటం చాలా గర్వించదగ్గ విషయం అని ప్రధాని మోదీ అన్నారు.