Ap Cabinet: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ఠ్. ఏపీలో ఇక పూర్తిగా ఇసుక ఉచితం లభించనుంది.. ఎడ్ల బండ్లకు కూడా అనుమతి ఇవ్వనుంది చంద్రబాబు సర్కార్. ఏపి క్యాబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దేవాలయాల పాలకమండళ్ళలో 17 మంది అంశానికి కేబినెట్ ఆమోదం తెలిపింది ఏపీ కేబినేట్.
ఉచిత ఇసుక అంశంలో ట్రాక్టర్లు, లారీలతో పాటుగా ఎడ్ల బండ్లలో కూడా అనుమతి ఇవ్వనుంది. ఉచిత ఇసుక పూర్తిగా ఉచితం చేసింది ప్రభుత్వం. అలాగే..పాలక మండళ్లలో ఇద్దరు బ్రాహ్మణులను సభ్యులుగా నియమించే అంశంపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన మార్గదర్శకాల పైన మంత్రివర్గంలో చర్చించి నిర్ణయం తీసుకుంటారని సమాచారం అందుతోంది. వాలంటీర్ల సర్వీసు కొనసాగింపు.. వేతనాల చెల్లింపు పైన మంత్రివర్గం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దేవాలయాల పాలక మండలిని 15 మంది నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై చర్చ, నిర్ణయం తీసుకోనుంది.