అమరావతిలో త్వరితగతిన అభివృద్ధి పనులు చేపట్టాలని సీఎం జగన్ ఆదేశాలు జారీ చేశారు. అమరావతి ప్రాంతంలో పనులపై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరకట్ట రోడ్డు విస్తరణ పనులు వేగవంతం అయ్యాయన్న అధికారులు.. ఇప్పటికే విద్యుత్ స్తంభాలను తొలగించామని తెలిపారు.
దీంతో పనులు వేగవంతం అవుతున్నాయన్న అధికారులు.. సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ–3)పైన కూడా దృష్టి పెట్టామని వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఐఏఎస్ అధికారుల క్వార్టర్ల నిర్మాణ పనులు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు.
ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంలో ఒక ఎంఐజీ లే అవుట్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. న్యాయ వివాదాలు లేని క్లియర్ టైటిల్స్ వినియోగదారులకు ఉండాలి.. జగనన్న స్మార్ట్ టౌన్షిప్ (ఎంఐజీ లేఅవుట్స్) కోసం ఇప్పటివరకూ 82 అర్బన్ నియోజకవర్గాల్లో సుమారు 6,791 ఎకరాల గుర్తించాలని వెల్లడించారు. శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరు, వైయస్సార్, కర్నూలు, శ్రీ సత్యసాయి, తిరుపతిలో రెండు చోట్ల లే అవుట్స్ పనులు జరుగుతున్నాయని చెప్పారు సిఎం జగన్.