చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు, వెన్నుపొట్లే – సీఎం జగన్‌

-

చంద్రబాబు బతుకంతా వాగ్దానాలు, వెన్నుపోట్లే అంటూ రెచ్చిపోయారు ఏపీ సీఎం జగన్‌. వరుసగా నాలుగో ఏడాది జగనన్న విద్యా కానుక అమలు చేసింది జగన్‌ సర్కార్‌. ప్రభుత్వ, ఎయిడెడ్ స్కూల్ విద్యార్థులకు ఉచితంగా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ, చంద్రబాబు జీవితమే ఓ మోసం ,పచ్చి అబద్దం  అన్నారు.

పద్నాలుగు ఏళ్లు సీఎం గా ఉన్న చంద్రబాబు ఈ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఏం చేశాడు చెప్పాలన్నారు. చంద్రబాబు పేరు చెపితే వెన్ను పోటు,మోసం,కుట్ర,దగా గుర్తుకు వస్తాయని విమర్శలు చేశారు. చంద్రబాబు నీ కాపాడటానికి దుష్ట చతుష్టయం అండగా ఉందని..బాబు జీవిత చక్రం ఓ మోసం అంటూ ఆగ్రహించారు. నాలుగేళ్లలోనే విద్యారంగంలో చాలా మార్పులు తెచ్చాం.. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చామని వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభమైన తొలి రోజే విద్యాకానుక అన్నారు. ప్రతి విద్యార్థికి యునిఫాంతో పాటు నోట్ బుక్స్, వర్క్ బుక్స్, డిక్షనరీ.. ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యార్థులకు ఉచిత కిట్లు అందిస్తున్నట్లు చెప్పారు సీఎం జగన్.

Read more RELATED
Recommended to you

Exit mobile version