వ్యవసాయ పంచాంగం 2023–24ను ఆవిష్కరించిన సీఎం జగన్

-

ముఖ్యమంత్రి జగన్ క్యాంపు కార్యాలయ ప్రాంగణంలో ఘనంగా శోభకృత్‌ నామ ఉగాది వేడుకలు జరిగాయి. తిరుమల దేవాలయం నమూనాలో ఉగాదివేడుకలు వేదికగా జరిగాయి. పల్లె సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబింబించేలా ఉగాది వేడుకల ప్రాంగణం అలంకరణ చేశారు. ఈ ఉగాది వేడుకలకు హాజరైన ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, భారతి దంపతులు…సాంప్రదాయ పంచకట్టులో కనిపించారు. అనంతరం వ్యవసాయ పంచాంగం 2023–24ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి జగన్‌.. సాంస్కృతికశాఖ రూపొందించిన క్యాలెండర్‌ను ఆవిష్కరించారు.

ఇక ఈ సందర్భంగా ప్రజలకు వైయస్‌.జగన్‌, ముఖ్యమంత్రి జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు. ఇక్కడకి ఉగాది వేడుకలకు హాజరైన వారితో పాటు రాష్ట్రంలో ఉన్న ప్రతి అక్కకూ, చెల్లెమ్మకూ, ప్రతి సోదరుడుకి, స్నేహితుడికీ, ప్రతి అవ్వాతాతలకూ ఈ ఉగాది సందర్భంగా రాబోయే సంవత్సరం అంతా మంచి జరగాలని, దేవుడు ఆశీస్సులు మెండుగా ఉండాలని మనసారా ఆకాంక్షిస్తూ.. అందరికీ ఉగాది శుభాకాంక్షలు చెప్పారు. ఉగాది వేడుకల్లో ఉపముఖ్యమంత్రి (దేవాదాయశాఖ) కొట్టు సత్యన్నారాయణ, సాంస్క్రృతిక పర్యాటకశాఖమంత్రి ఆర్‌ కె రోజా, పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, గృహనిర్మాణశాఖ మంత్రి జోగి రమేష్, ప్రభుత్వ విప్‌ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, పలువురు ఇతర ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news