సీఎం జగన్ మోహన్ రెడ్డి.. ఓ టార్చ్ బేరర్ అంటూ నారా లోకేష్ సంచలన ట్వీట్ చేశారు. సాక్షి న్యూస్ పేపర్ లో వచ్చిన ఓ ఆర్టికల్ ను షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్. “టార్చ్ బేరర్ సీఎం జగన్… గారు అని మీ వందిమాగధులు భజనలు చేస్తున్నారు. మీ టార్చర్.. మీరు చూపించే హారర్ సినిమాలు చూడలేక కార్పొరేట్ కంపెనీలు అయ్యబాబోయ్ అంటున్నాయని మీ క్విడ్‌ప్రోకో ఆస్తి సాక్షి వెల్లడిస్తోందని చురకలు అంటించారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలిపి 554 నాన్ షెడ్యూల్డ్ గ్రామాలున్నాయి, ఆయా ప్రాంతాల్లో వున్న విలువైన ఖనిజ నిక్షేపాల దోపిడీ కోసమే ఈ ప్రాంతాలను వైసీపీ పెద్దలు తమ కబంధహస్తాల్లో పెట్టుకున్నారని మండిపడ్డారు.
నాన్ షెడ్యూల్డ్ గ్రామాల్లోని గిరిజనులు మౌలిక వసతులు, అభివృద్ధి, హక్కులు, రక్షణ, విద్య, ఉద్యోగావకాశాలు, ప్రభుత్వ పథకాలు, భూముల క్రయవిక్రయాలు వంటి వాటిలో తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారని.. తక్షణమే సమస్య పరిష్కారం కోసం వైసీపీ ప్రభుత్వం వెంటనే కేంద్రంతో సంప్రదింపులు జరపాలని డిమాండ్ చేశారు. తమరి నిర్వాకాన్ని, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక-అభివృద్ధి పతనాన్ని సూచిస్తోంది. మీ తెలివైన కోడికత్తి మెదడుకి అర్థం కావాల్సింది ఏంటంటే… కార్పొరేట్ పన్నులు ఏటేటా తగ్గుతున్నాయంటే, రాష్ట్రానికి కొత్త కంపెనీలు రాలేదని, ఉన్నవీ జెండా ఎత్తేస్తున్నాయని, నడుస్తున్న కంపెనీలలో కార్యకలాపాలు తగ్గిపోయాయని ముఖ్యమంత్రి గారూ! అంటూ జగన్ పై నిప్పులు చెరిగారు.