మహాత్మా గాంధీ గారి మార్గంలోనే నడుస్తానని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. ఇవాళ మహాత్మా గాంధీ జయంతి అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. మహాత్మా గాంధీ జయంతి శుభాకాంక్షలు చెబుతున్నారు. అటు మహాత్మా గాంధీ జయంతి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ట్వీట్ చేశారు.

మహాత్మా గాంధీ గారి మాటలు ఆదర్శంగా…ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరి సంక్షేమమే లక్ష్యంగా పాలన చేస్తున్నామన్నరాఉ. గ్రామ /వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా గాంధీ గారు కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని నిజం చేశామని తెలిపారు. మునుముందు కూడా ఆయన చూపిన మార్గంలోనే నడుస్తామని తెలిపారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి. నేడు మహాత్మా గాంధీ గారి జయంతి సందర్భంగా నివాళులు అర్పించామని వివరించారు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి.