సితార మంచి మనసు.. వీడియో వైరల్.. ఫిదా అవుతున్న నెటిజన్లు

-

సూపర్ స్టార్ మహేశ్ బాబు.. రీల్ లైఫ్​లోనే కాదు రియల్ లైఫ్​లోనూ హీరోయే. మహేశ్ బాబు మనసు ఎంతో మంచిదని నిరూపించే ఎన్నో సంఘటనల గురించి ఇప్పటికే అందరికీ తెలుసు. పేదలకు చేతనైనంత సాయం చేస్తూ ఇప్పటికే పలు సందర్భాల్లో గొప్ప మనసు చాటుకున్నారు మహేశ్‌బాబు. చిన్నారులకు, పేదల ఆరోగ్యానికి తన వంతు సాయం చేస్తున్నారు. పలు గ్రామాలు దత్తతు తీసుకుని వాటి అభివృద్ధికి కృషి చేస్తున్నారు. అయితే తండ్రి బాటలో మహేశ్ బాబు తనయ సితార కూడా నడుస్తోంది. ఇప్పటికే తన మొదటి సంపాదనను చారిటీ కోసం ఉపయోగించిన విషయం తెలిసిందే. తాజాగా సితార మంచి మనసును చూపించే ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

దసరా వేడుకలను పురస్కరించుకుని హైదరాబాద్‌ కూకట్‌పల్లిలోని ఓ షాపింగ్‌ మాల్‌లో అతిపెద్ద బొమ్మల కొలువు ఏర్పాటు చేశారు. దీని ప్రారంభోత్సవ కార్యక్రమంలో మహేశ్‌ సతీమణి నమత్ర, కుమార్తె సితార పాల్గొన్నారు. సదరు షాపింగ్‌ మాల్‌ వారు పలువురు పేద వృద్ధులు, మహిళలకు బహుమతులు అందజేశారు.

బహుమతి అందుకోవడం కోసం స్టేజ్‌పైకి ఎక్కడానికి ఇబ్బందిపడిన ఓ వృద్ధురాలికి సితార సాయం చేసింది. చేయి పట్టుకుని ఆమెను వేదికపైకి తీసుకువచ్చి.. అక్కడి వారందరితో నవ్వుతూ మాట్లాడుతూ ఫొటోలు దిగింది. సితార మంచి మనసుకు మురిసిపోయిన ఓ వృద్ధురాలు.. అపురూపంగా ఆమెను ముద్దుపెట్టుకున్నారు. దీనికి సంబంధించిన పలు వీడియోలు ప్రస్తుతం నెటిజన్ల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ‘లైక్‌ ఫాదర్‌ లైక్‌ డాటర్‌’ అంటూ నెటిజన్లు కామెంట్స్‌ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news