తిరుమల భక్తులకు టీటీడీ పాలకమండలి అదిరిపోయే శుభవార్త చెప్పింది. తిరుమలలో బ్రేక్ దర్శనం టికెట్లు కొనుగోలు మరియు గదుల బుకింగ్ చెల్లింపులను టిటిడి పాలక మండలి సులభతరం చేయనుంది. పే లింకు ఎస్ఎంఎస్ ద్వారా సొమ్ము బదిలీ చేసే విధానాలను విస్తరిస్తోంది.
ప్రస్తుతం తిరుమల శ్రీవారి అర్జిత సేవా టికెట్ల కేటాయింపుల అభ్యర్థుల చెల్లింపులను పే లింక్ ద్వారా భక్తులు చేస్తుండగా… దీన్ని విఐపి బ్రేక్ దర్శనం మరియు ఇతర సేవలు, గదుల బుకింగ్ కు చేయనుంది. పే లింక్ ఎస్ఎంఎస్ పంపిస్తే వారు దానిపై క్లిక్ చేసి సొమ్ము చెల్లించవచ్చు.
ఇది ఇలా ఉండగా, కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి భక్తులకు టీటీడీ ప్రకటన చేసింది. తిరుమలలో చంద్రగ్రహణం కారణంగా శ్రీవారి ఆలయం మూసివేయనున్నట్లు టీటీడీ పేర్కొంది. 29వ తేదీ వేకువజామున ఉదయం 1:05 గంటల నుంచి 2:22 గంటల మధ్య చంద్ర గ్రహణం ఏర్పడనుంది. చంద్రగ్రహణం కారణంగా 28వ తేదీ రాత్రి 7 గంటల నుంచి 29వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేయనున్నారు.