చిన్నారికి నామకరణం చేశారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. చిన్నారికి రాజశేఖర్ అని నామకరణం చేశారు సీఎం జగన్. భీమవరంలో సీఎం వైయస్ జగన్ గారు ఓ చిన్నారికి నామకరణం చేశారు. చిట్టూరి సోనీ, చిట్టూరి మోహన్ కుమార్ దంపతులు తమ ఐదు నెలల బిడ్డని తీసుకుని జగనన్న వద్దకి వచ్చి పేరు పెట్టాలని కోరారు.

దాంతో ఆ చిన్నారిని ప్రేమతో దగ్గరికి తీసుకుని ముద్దాడుతూ ‘రాజశేఖర్’గా నామకరణం చేశారు. ఇక అటు పవన్ కళ్యాణ్… కార్లను మార్చినట్లు భార్యలను మారుస్తాడని సంచలన వ్యాఖ్యలు చేశారు ఏపీ సీఎం జగన్.పెళ్లి అనే పవిత్ర సంప్రదాయం పక్కన పెట్టి.. కార్లు మార్చుతున్నట్టు భార్యలను మర్చుతున్న పెద్ద మనిషి గురించి ప్రజలు ఆలోచించాలని కోరారు. నాకు ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు..ఇదే మాదిరిగా ప్రతి ఒక్కడు చేస్తే మన చెల్లెళ్ళు, అక్కల పరిస్థితి ఏంటో ప్రజలు ఆలోచించాలని కోరారు సీఎం జగన్. విలువలు, విశ్వసనీయత అసలు లేకుండా పరిపాలన చేసిన వాళ్ల గురించి ప్రజలు ఆలోచించాలన్నారు.